Avatar
SakshiMedia

0 Following 0 Followers
1
లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్‌): విభజన హామీల అమలుకు చేతనైతే కేంద్రంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. అందుకు ప్రభుత్వం ముందుకు వస్తే పోరాటానికి తాము కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెలో మీడియా సమావేశంలో ఆయన ఇవాళ మాట్లాడారు.
1
హైదరాబాద్‌: ఇవాంకా రాకతో హైదరాబాద్‌ నగరం చాలా అందంగా ముస్తాబైన విషయం తెలిసిందే. దీనిపై హీరోయిన్‌ మాధవిలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాంకా వస్తుందని నగరంలో రోడ్లు, పేయింటింగ్‌లు వేసి అందంగా మార్చేశారు. మరీ మన అధినేతలు అమెరికాకు వెళ్లినప్పుడు కొత్తగా వాళ్లేం చేయరు ? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని సూచించింది.
1
సాక్షి,న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్‌ ఉద్యోగాలను కొల్లగొట్టేస్తున్న క్రమంలో మానవ వనరులను కాపాడుకునేలా నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. 1991 పారిశ్రామిక విధానం, యూపీఎ సర్కార్‌ 2011లో ప్రకటించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీ స్ధానంలో నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటిస్తామని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి సురేష్‌ ప్రభు వెల్లడించారు. దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని చెప్పారు.
1
సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె  ఇవాంకా ట్రంప్‌ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోట చేరుకున్నారు. జీఈఎస్‌కు హాజరయిన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అధికారికంగా విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. అంతకు ముందు యూఎస్‌ సీక్రెట్‌ ఏజెంట్స్‌ గోల్కొండ కోటలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు  పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
1
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. గత చిత్రం విజయం సాధించినా.. ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుకున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు రామ్.
1
సాక్షి, హైదరాబాద్‌: అందం, ఆహార్యంతోనే కాదు.. మాట్లాడే తీరులోనూ ఇవాంకా ట్రంప్‌ అదరహో అనిపించింది. ఆత్మ విశ్వాసాన్ని ప్రతి బింబిస్తున్న నడకతో, ముఖ్యంగా మోముపై చెరగని చిరునవ్వుతో ఆకట్టుకుంది. దీంతో సదస్సుకు వచ్చినవారంతా ఆమెకు అభిమాను లైపోయారు. ఈ నేపథ్యంలో ఇవాంకా మాట తీరు, సంతకం, వస్త్రధారణలను హైదరాబాద్‌కు చెందిన పలువురు నిపుణులు విశ్లేషించారు.
1
భట్టిప్రోలు: బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని ఓ అజ్ఞాత వ్యక్తి ఓ మహిళకు ఫోన్‌ చేశాడు. మీ ఏటీఎం కార్డు గడువు ముగిసిందని, రెన్యువల్‌ చేయాలంటే కార్డు నంబర్‌ చెప్పాలని నమ్మించాడు. ఆపై అకౌంట్‌లో ఉన్న రూ.50 వేలు మాయం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భట్టిప్రోలు ఎస్‌ఐ ఇ.బాలనాగిరెడ్డి కథనం ప్రకారం.. స్థానిక కేఎస్‌కే కళాశాల సమీపంలో నివసిస్తున్న షేక్‌ ఆసియాకు మంగళవారం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ ఏటీఎం గడువు ముగిసిందని, రెన్యువల్‌ చేయాలంటే కార్డు నంబర్‌ చెప్పాలని తెలిపాడు.
1
అఖిల్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్, ఈ ఏడాది చివర్లో హలో అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తొలి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవటంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో కన్ఫమ్ గా సక్సెస్ సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.