Avatar
SakshiMedia

0 Following 0 Followers
2
చంఢీగఢ్‌‌ : 20కి పైగా సినిమాల్లో ఉపయోగించిన రైలింజిన్‌ డ్రైవర్‌ లేకుండా రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించి పట్టాలు తప్పింది. హరియాణాలోని రెవారిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆ స్టీమ్‌ ఇంజిన్‌ పేరు అక్బర్‌. దీని ప్రత్యేకత ఏంటంటే.. సుల్తాన్‌, బాగ్‌ మిల్కా బాగ్‌, రంగ్‌ దే బసంతి సహా 20కి పైగా బాలీవుడ్‌ సినిమాల్లో ఈ రైలింజిన్‌ను వినియోగించడం గమనార్హం.​
2
ఉరకలెత్తే కృష్ణమ్మకు, ఉప్పొంగి ప్రవహించే గోదారమ్మకు తెలియదు. తమ చల్లటి ఒడిలో ఇంత ఘోరం జరుగుతుందని. అవధుల్లేని ఆనందానికి, హద్దుల్లేని సంబరానికి తెలియదు. ఎన్నో కుటుంబాల కన్నీటి ప్రవాహానికి తాము కారణమవుతామని. మనసారా దీవెనలిచ్చే బెజవాడ దుర్గమ్మకు తెలియదు. తన చెంత గుండెలు పగిలే విషాదం గూడుకట్టుకుందని. ఇప్పుడు ఎవరికి తెలిసినా ఏం లాభం.. ఆ దేవుడి హృదయం ద్రవించినా ఏం ప్రయోజనం? ఘోర ప్రమాదం.. పగబట్టినట్టుగా పడవ రూపంలో వచ్చి 17 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘాతుకాన్ని కళ్లారా చూసిన కృష్ణమ్మ కళ్లల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నా..
2
సాక్షి, చెన్నై : తనకు ఎవరి నుంచి ఎటువంటి బెదిరింపులు రాలేదని నటుడు శింబు పేర్కొన్నారు. చర్చనీయాంశ నటుల్లో శింబు ఒకరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి ఉండదు. ఆ మధ్య బీప్‌ సాంగ్‌ పాడి కేసులు, కోర్టులు అంటూ తిరిగిన ఈ హీరో  తాజాగా అలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానాలను ఎక్కుపెట్టి వైరముత్తు కొడుకు కపిలన్‌ రాసిన పాటను పాడారు. అందులో పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను, ఆ విధానాలకు వ్యతిరేకంగా నటులు రజనీకాంత్, కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలు పొందుపరచారు.
2
సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది ఇటీవల వేసిన సెటైర్‌లపై మండిపడ్డారు. ఈ గురువారం జబర్దస్త్‌లో హైపర్‌ ఆది స్కిట్‌లో బాగంగా ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ ముందు పోట్ట వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’  అనే పంచ్‌లు తనను విమర్శించేలా ఉన్నాయని కత్తి మహేష్‌ మండిపడ్డారు. ​
2
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు, చివరకు నారాయణ కళాశాల విద్యార్థులతో పాటు పార్టీ నేతలు కొందరు జగన్‌ పాదయాత్రపై రోజూ నివేదికలు తయారుచేస్తున్నారు. ఆ నివేదికలను ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాటిపై సీఎం చంద్రబాబు ప్రతి రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిసింది.
1
సాక్షి, నేలతిమ్మాయిపల్లి: ప్రతిపక్ష నేత, వైఎ‍స్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడో రోజు 'ప్రజాసంకల్పయాత్ర'ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
1
కోల్‌కత్తా : దేశంలోనే రెండో అతిపెద్ద హ్యాండ్‌సెట్‌ తయారీదారిగా ఉన్న ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌కు రిలయన్స్‌ జియో భారీగా దెబ్బకొట్టింది. అటు టెలికాం కంపెనీలకే కాక, ఇటు మొబైల్‌ కంపెనీలకు ఇది తీవ్ర సంకటంగా నిలుస్తోంది. 2016-17లో ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ విక్రయాలు 30 శాతం మేర క్షీణించాయి. దీనికంతటికీ కారణం రిలయన్స్‌ జియో ఎంట్రీ, డిమానిటైజేషన్‌ ప్రభావమేనని తెలిపింది. తమ రెవెన్యూలు కిందకి దిగజారాయని, రిలయన్స్‌ జియో రాకతో ఇండస్ట్రి హఠాత్తుగా 2జీ, 3జీ నుంచి 4జీకి మారిపోయిందని ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లోపేర్కొంది..
1
బీజింగ్‌ : భారత్‌ను దెబ్బకొట్టేలా పాకిస్తాన్‌-చైనా తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌లోని మసూద్‌ అజర్‌లాంటి ఉగ్రవాదులకు వంత పాడుతున్నా చైనా.. తాజాగా అక్కడ బ్యాంకింగ్‌ సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తన తొలి బ్రాంచ్‌ను కరాచీలో ఆరంభించింది. బ్యాంక్‌ ఆఫ్‌ చైనా బ్రాంచ్‌ ఏర్పాటు సందర్భంగా.. బీజింగ్‌-ఇస్లామాబాద్‌ మధ్య సోదర సంబంధాలు మరింత గట్టిపడతాయని పాకిస్తాన్‌ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్‌-చైనా మధ్య స్నేహసంబంధాల్లో ఇది ఒక మరపురాని ఘట్టమని పాకిస్తాన్‌ అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించారు.